హర్షణీయంలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు.

Harshaneeyam - En podkast av Harshaneeyam

Podcast artwork

Kategorier:

హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం.గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకువెళ్లాలని మొదట్నుంచీ మా ప్రయత్నం గా వుండింది.దానికి కొనసాగింపుగానే కొన్ని రోజులక్రితం , తెలుగు కథా సాహిత్యంలో వున్న గొప్ప రచనలని ఒకటొకటిగా మీకందరికీ పరిచయం చెయ్యాలని, మేము అనుకున్నాము.ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీకందించబోతున్న ఈ ' కథా నీరాజనం' కార్యక్రమం.కథా నీరాజనంలో భాగంగా, ప్రతి ఎపిసోడ్ లో, ఒక గొప్ప తెలుగు కథని సంక్షిప్త రూపం లో పరిచయం చేస్తూ , ఆ కథ పై పాఠకులుగా , మా అభిప్రాయాలని, హర్ష , నేను , గిరి ఒక చిన్న చర్చా కార్యక్రమం ద్వారా మీకు అందించబోతున్నాము .ఈ మా ప్రయత్నాన్ని ఎప్పటిలాగే మీరందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము.ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మీకు పరిచయం చెయ్యబోతున్న కథ కు, రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు శ్రీ మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు శ్రీ మహేంద్ర కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని నిరంతరమూ కృషి చేసే హాలికుడాయన.అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కథ' అవార్డు తో బాటూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన, ఈ ప్రయాణంలో.గత కొన్ని దశాబ్దాలుగా, తెలుగు కథ కి పథా నిర్దేశనం చేస్తూ వస్తున్న ఆ రచయిత పేరు డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు.'కథ నీరాజనం' ఎవరి కథలతో ఆరంభించాలి, అని ఆలోచించినప్పుడు మాకు స్ఫురించిన మొదటి పేరు శ్రీ,.మధురాంతకం నరేంద్ర గారు.ఈ మొదటి ఎపిసోడ్ కి వున్న ఇంకో ప్రత్యేకత, ఈ చిన్ని ప్రయత్నాన్ని వారికి వివరించి, మొదటి ఎపిసోడ్ ఆరంభించమని ఆహ్వానించినపుడు, వెంటనే మా కోరికను మన్నించి వారు తమ అంగీకారాన్ని తెలియజెయ్యడం.శ్రీ మధురాంతకం నరేంద్ర గారికి హర్షణీయం జట్టు తరఫున, పాఠకుల తరఫున మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ చర్చా కార్యక్రమంలో , భాగంగా మొదటగా వారి రచనా రీతి పైన తరువాత ఆయన రచించిన , 'నాలుగు కాళ్ళ మంటపం' అనే కథాసంకలనంలోని కొన్ని కథలపై , ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వడం జరిగింది.*ఈ ఇంటర్వ్యూకి తన సహకారాన్ని అందించిన మిత్రుడు LP కి హృదయ పూర్వక కృతజ్ఞతలు.విషయసూచిక:
00:00 -హర్షణీయంలో తెలుగుకథా నీరాజనం శ్రీ మధురాంతకం నరేంద్ర గారితో.

03:33) - తన రచనలపై వారి తండ్రి గారు, సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శ్రీ మధురాంతకం రాజారామ్ గారి ప్రభావం.

(11:35) - తన రచనలపై ఇంటి వాతావరణ ప్రభావం.

(18:04) - తన రచనల్లో శ్రమ జీవన సౌందర్య చిత్రీకరణ.

(21:30) - పాత్రల్లో సహజత్వం.

(29:47) - తన రచనల్లో స్త్రీ పక్షపాతం.

(31:18) - నవలా ప్రక్రియ.

(45:15) - కథా రచన మరియు ప్రచురణలో వస్తున్న మార్పులు.

(65:20) - తెలుగు రచయితలకు గుర్తింపు ఎందుకు తక్కువ?

(71:21) - తన రచనలపై మార్క్సిజం ప్రభావం.

(75:42) - కథలు వ్రాయటం నేర్పించవచ్చా?

(77:24) - రాబోతున్న రచనలు

(80:14) - 'నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం' రచనా విశేషాలు

(83:02) - 'నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం' లోని 'కాకులు గ్రద్దలు' కథపై చర్చ.

(95:33) - 'నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం' లోని 'ఒక మైనారిటీ కథ ' కథపై చర్చ.

(105:39) - 'నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం' లోని 'సద్గతి' కథపై చర్చ.

(114:46) - సాహిత్యానికి పరమార్థం

పుస్తక ప్రచురణ వివరాలు:ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.(

Visit the podcast's native language site