తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ

Harshaneeyam - En podkast av Harshaneeyam

Podcast artwork

Kategorier:

కన్నడలో అనేక కథాసంకలనాలు, వ్యాసాలతో పాటు రెండు నవలలు రచించారు వసుధేంద్ర. కర్ణాటక సాహిత్య అకాడమీ బహుమతి, యు ఆర్ అనంతమూర్తి అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందుకున్నారు.ఆయన రాసిన తేజో తుంగభద్ర నవల, 1490 - 1520 సంవత్సరాలలో  పోర్చుగల్ దేశం, విజయనగర సామ్రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రచింపబడింది. ఇప్పుడు తెలుగులో రంగనాధ రామచంద్ర రావు గారి అనువాదంతో, ఛాయా పబ్లిషర్స్ ద్వారా మీ ముందుకు వచ్చింది. పోర్చుగల్ లో ప్రవహించే తేజో నదీ, విజయనగర సామ్రాజ్యంలో ప్రవహించే తుంగభద్ర  నదీ తీరాలలోనే దాదాపుగా కథంతా నడుస్తుంది. కలిసి జీవించాలనుకునే రెండు జంటలు, కథలో ప్రధాన పాత్రధారులు.  పోర్చుగల్ రాజు వ్యాపార విస్తరణ కోసం, విజయనగర రాజు రాజ్య విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు, సాధారణ పౌరుల  జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది కథలో ప్రధాన అంశం. ఒక ఆసక్తికరమైన ప్రేమ కథతో  ఈ విషయాలన్నింటినీ ముడివేస్తూ, కొన్ని మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది నవల. “మనం ఎవరమో, ఎందుకిలా ఉన్నామో  చెప్పేదే చరిత్ర” అంటారు అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ మెకల్లా. ఇదే పని ఈ నవల ద్వారా పూర్తి చేశారు వసుధేంద్ర.   ఈ ఇంటర్వ్యూలో ఆయన నవలకు సంబంధించిన అనేక ఆసక్తి కరమైన అంశాలను మనతో పంచుకున్నారు. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Visit the podcast's native language site